సోమవారం, కోటబొమ్మాలి మండలం తిలారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిలారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రైల్వే పోస్ట్ కమాండర్ ఎస్. కాంతారావు విద్యార్థులకు మానవ అక్రమ రవాణా, రైల్వే ఆస్తుల దొంగతనం, మత్తుమందు వాడకం, రైలు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెల్ప్ లైన్ నంబర్ 139 ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్. చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ తపన్ కుమార్ నాయక్, లేడీస్ సబ్ ఇన్స్పెక్టర్ బి. అరుణ, పి. రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.