నెల్లిపర్తిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

262చూసినవారు
నెల్లిపర్తిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ శెట్టి నర్సింగ్ రావు, డివి రమణారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఎగరవేశారు. డివి రమణారావు మాట్లాడుతూ  టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి అచ్యుతరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్