
పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపు లేదు
రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలు (3 విడతల్లో) అందిస్తోంది. అయితే ఈ సాయాన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేయకపోవడంతో రైతులు నిరాశ చెందారు. కాగా తెలంగాణలో ఈ పథకం ద్వారా 30 లక్షల మంది వరకు రైతులు లబ్ధి పొందుతున్నారు.




