శనివారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఎం. కృష్ణవేణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, అకాడమిక్ ప్లాన్ ప్రకారం బోధన చేసి మంచి
ఫలితాలు సాధించాలని, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో DIEO సూపరింటెండెంట్ జోగారావు, ప్రిన్సిపాల్ బాడ వెంకట మోహన్, అధ్యాపకులు పాల్గొన్నారు.