పలాస-పూండి రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఒక యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వర రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని, సుమారు 30-35 ఏళ్లుంటాయని, నీలి రంగు షర్టు, కాపీ కలర్ ప్యాంటు ధరించాడని తెలిపారు. ఈ గుర్తుల ఆధారంగా వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.