
పాతపట్నం: ఉమారుద్ర కోటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే మామిడి
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీకాకుళం నాగావళి తీరాన ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈవో సుకన్య, ప్రధానార్చకులు రాంజీ ఆయనకు స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చిత్రపటాన్ని అందజేశారు. కార్తీక సోమవారం స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.



































