పాతపట్నంలో గురువారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు సమిష్టిగా కృషి చేయాలని, రైతులు తమ ఉత్పత్తులను సౌకర్యవంతంగా విక్రయించుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. కొత్త గోడౌన్లు, తూకం యంత్రాలు, నీటి వసతులు, షేడ్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని కోరారు.