గుడ్డు పెట్టిన కోడిపుంజు

5చూసినవారు
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్‌పేట మండలం బొర్రంపేట గ్రామంలో సతీష్ అనే వ్యక్తి పెంచుతున్న కోడిపుంజు గుడ్డు పెట్టడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా కోడిపెట్టలే గుడ్లు పెడతాయి కాబట్టి ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశమైంది. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. కొందరు మాత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజమైందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్