పాతపట్నం మండల స్థాయిలో మంగళవారం జరిగిన చెకుముకి ప్రతిభా పరీక్షలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రొంపివలస విద్యార్థులు ప్రథమ స్థానాన్ని, కొరసవాడ విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో విక్టరీ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 23న శ్రీకాకుళంలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పరీక్షలో 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తిరుమల్ రావు, ప్రధానోపాధ్యాయులు బి.సింహాచలం, టి. వైకుంఠ రావు, నల్ల తారక రామారావు, ఎస్ రామారావు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.