పాతపట్నం మేజర్ పంచాయతీతో పాటు పలు గ్రామాలకు చెందిన సుమారు 400 కుటుంబాలు వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ నుంచి
జనసేన పార్టీలో చేరాయి. ఈ చేరికలు గురువారం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్నాయి. సుడా ఛైర్మన్ రవికుమార్ ఆధ్వర్యంలో వీరంతా
జనసేన పార్టీలో చేరారు. ఆయన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో
వైసీపీ నాయకులు డాక్టర్ రేగేటి షణ్ముఖ రావు కూడా ఉన్నారు.