కొత్తూరు: జీడి తోటలు దగ్ధం.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

1చూసినవారు
కొత్తూరు: జీడి తోటలు దగ్ధం.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
కొత్తూరు మండలం ఒండ్రుజోల గ్రామంలో మంగళవారం సాయంత్రం జీడి తోటలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. రైతులు బామిడి సుందర రావు, జంక తిరుపతిరావు, బి శాంతారావు, కుంచాల దాస్ లకు చెందిన రెండు ఎకరాల జీడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో, సుమారు 200 ఎకరాల తోటలు ప్రమాదం నుండి బయటపడ్డాయి. అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ బుచ్చోడు ఆధ్వర్యంలో ఈ కార్యకలాపాలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్