కొత్తూరు మండలంలోని నివగాం ఆర్టిసి కాంప్లెక్స్ లీజు రద్దు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నివగాంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నివగాం పంచాయతీ కేంద్రంలో ప్రజలు, ప్రయాణికులు సౌకర్యార్ధం 1995లో కాంప్లెక్స్ నిర్మించారని అన్నారు. గత ఏడాది ప్రయివేటు వ్యక్తులకు పదేళ్లకు ఆర్టిసి ఉన్నతాదికారులకు లీజుకు ఇచ్చారని తెలిపారు.