ఎల్ ఎన్ పేట: ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే మామిడి

1చూసినవారు
ఎల్ ఎన్ పేట మండలం గడేవాని పేట గ్రామంలో శ్రీ గౌరీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆలయానికి చేరుకుని ధ్వజస్తంభ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం అందజేశారు. గ్రామాలలో దేవాలయాలు ఉంటే ఆధ్యాత్మికత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్