పాతపట్నం ఎక్సైజ్ శాఖ పరిధిలోని పలాస, టెక్కలి, మెలియాపుట్టి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో శనివారం సాయంత్రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 14,100 లీటర్ల పులిసిన ఊట, 1070 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కే కృష్ణారావు తెలిపారు. పండగ వేళ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.