ఒడిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో నాటు సారా ఊటలను ధ్వంసం చేసి, నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ సీఐ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జరిగిన దాడుల్లో 7200 సారా ఊటలను ధ్వంసం చేయడంతో పాటు 560 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. పండుగ సందర్భంగా నాటు సారా తయారీ ఎక్కువగా ఉందని అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.