పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్

7చూసినవారు
పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లిలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న ఉపాధ్యాయురాలిపై విద్యాశాఖ వేటు వేసింది. కుర్చీలో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ, విద్యార్థులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలి వీడియో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటూ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. నెటిజన్లు ఉపాధ్యాయురాలి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్