తిలారు ఉన్నత పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ, పాఠశాలకు మంచి పేరు తెచ్చారు

20చూసినవారు
తిలారు ఉన్నత పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ, పాఠశాలకు మంచి పేరు తెచ్చారు
శ్రీకాకుళం, టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం తిలారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. సంపతిరావు వర్షిణి (574), నీలాబు ఝాన్సీ (564), తర్ర సిరివెన్నెల (550), తర్ర ఝాన్సీ (550) అత్యధిక మార్కులు సాధించారు. ఈ విజయంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ప్రధానోపాధ్యాయులు ఎంఎస్. చంద్రశేఖర్ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారాన్ని అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.