Apr 18, 2026, 15:04 IST/మానకొండూర్
మానకొండూర్
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి - కలెక్టర్ గరిమ అగ్రవాల్*
Apr 18, 2026, 15:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శనివారం అధికారులతో జరిగిన సమీక్షలో, రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాణాల మేరకే కొనుగోళ్లు జరపాలని, కూలీలను అందుబాటులో ఉంచాలని, రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.