శ్రీకాకుళం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. 18 ఏళ్లు నిండిన మహిళా అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.