నందిగాంలో యువరైతు మట్ట ఉమాపతి సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన టమాటా, మిరప పంటల్లో ఒక మిరప చెట్టు సుమారు 9 అడుగుల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటి వద్దనే రసాయనిక ఎరువులు వాడకుండా, సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అనూహ్యమైన ఘటన స్థానికులను ఆకట్టుకుంది.