జగతికేసుపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నగర సంకీర్తన, సీతారాముల కల్యాణం జరుగుతుండగా, ఒక వానరం కాషాయవర్ణంతో కూడిన వస్త్రాన్ని చేతపట్టుకొని వీధుల్లో ప్రదక్షిణలు చేసింది. త్రేతాయుగంలో శ్రీరామునికి వానరాలు ఎంతగానో సహకరించాయని, కష్టాల్లో ఉన్నప్పుడు ఆంజనేయుడు చూపిన ధైర్యసాహసాలు రామాయణంలో గుర్తుంటాయని, నేడు శ్రీరామనవమి సందర్భంగా ఆ వానరం చూపిన ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.