ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా, వంశధార నది తీరంలో బుధవారం నూతన సంవత్సరాన్ని (జనవరి 1) పురస్కరించుకుని 2026 ఆకృతిలో ఒక అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాఖండం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆయన ఈ ఇసుక కళాఖండం ద్వారా ఆకాంక్షించారు.