మందసలో యాక్సిడెంట్..ఇద్దరికి తీవ్ర గాయాలు

7చూసినవారు
మందసలో యాక్సిడెంట్..ఇద్దరికి తీవ్ర గాయాలు
మందస మండలం చీపి గ్రామానికి చెందిన సవర సూర్యారావు, సవర ప్రదీప్ ద్విచక్ర వాహనంపై ఒడిశా వెళ్లి వస్తుండగా, బుధవారం తెల్లవారుజామున దారికి అడ్డంగా వచ్చిన అడవిపందిని ఢీకొని కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్