సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో డయేరియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందగా, ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మరో కేసు నమోదు అయ్యింది. గ్రామానికి చెందిన రాజాపు లక్ష్మమ్మకు డయేరియా సోకడంతో, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ విశ్వనాథ్ గంగాధర్ ఆధ్వర్యంలో రామ మందిరం వద్ద తక్షణ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.