భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాలు సిద్ధమయ్యాయి. సూర్యనారాయణ స్వామి, కూర్మనాథుని దర్శించుకోనున్న ఆయన పర్యటన కోసం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు, భద్రతా బలగాలు ఇప్పటికే ఆలయాల వద్దకు చేరుకొని పర్యవేక్షిస్తున్నాయి. ప్రముఖుల రాకతో జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.