మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు కార్లను ధ్వంసం చేసి, భద్రతా సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కు పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది ఆర్.ఐ. పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.