అయ్యప్ప దీక్ష పూర్తయింది: భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరారు

1చూసినవారు
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని సింగివలస, అలికం, చింతాడ ప్రాంతాల నుండి 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్షను ఆచరించిన భక్తులు మంగళవారం శోభాయాత్రగా శబరిమల యాత్రకు బయలుదేరారు. దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు సంప్రదాయరీతిలో ఇరుముడి కట్టుకుని, భక్తిగీతాల నడుమ, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో శబరిమల కొండకు పయనమయ్యారు. స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామస్తులు అయ్యప్ప మాలధారులను ఘనంగా వీడ్కోలు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్