రణస్థలంలోని సూర్య స్కూల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం అందించినా, దాదాపు గంటసేపైనా ఘటనా స్థలానికి చేరుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 108 సిబ్బంది వ్యక్తి మృతి చెందాడని నిర్ధారించి వెళ్లిపోవడం చూపరులను కలచివేసింది. సమాచారం అందిన వెంటనే 108 చేరుకొని ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని స్థానికులు అంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.