శ్రీకాకుళం జిల్లాలో ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూన్ 10 వరకు సుమారు 3 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. దీనితో ఎక్సైజ్ శాఖకు రూ.64,64,74,741 ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మే నెలలో ఎండల తీవ్రత కారణంగా మందుబాబులు 1,50,022 కేసుల బీర్లు తాగినట్లు అధికారులు తెలిపారు.