శ్రీకాకుళం జిల్లా ఇలిసిపురంలో భద్ర మహంకాళి దేవర పండుగ సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చిన శక్తి వేషాలు, కేరళ వాయిద్యాలు, తప్పిడి గుళ్ళు, తీన్మార్ బ్యాండ్ మేళాలు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.