శ్రీకాకుళంలో జిల్లాలో సుర్రమంటున్న భానుడు

10చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో వేసవి తాపం తీవ్రమవుతోంది. ఆదివారం భానుడు చండ్ర నిప్పులు చెరిగాడు. గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్‌లు నమోదవుతున్నాయి. ఎండ, వేడికి రోడ్లు, రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. దీనికి తోడుగా వడ గాడ్పులు వీయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు 38-41 డిగ్రీలకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం.

సంబంధిత పోస్ట్