నగరంలోని పురుషోత్తమ నగర్ కాలనీలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీ రామ సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు జరిగాయి. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ రంప వెంకటరమణ శర్మ మరియు బ్రహ్మశ్రీ పేంట నీలాచల శర్మ గారు పౌరోహిత్యం వహించి, భక్తులతో శాస్త్రోక్తంగా వ్రత క్రతువును జరిపించారు. లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ పూజల్లో ఆలయ ధర్మకర్తలు, కాలనీవాసులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.