మెళియాపుట్టి మండలం చాపరలో శుక్రవారం ఒక బొలెరో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి వాహనంపై పడిపోవడంతో వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ తీగల వద్ద మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గురైన బొలెరో ఒడిశాకు చెందినదని స్థానికులు తెలిపారు.