బూర్జ: బస్సులు కోసం విద్యార్థుల నిరసన

2చూసినవారు
బూర్జ: బస్సులు కోసం విద్యార్థుల నిరసన
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కుపురం కూడలిలో సమయానికి బస్సులు రాకపోవడం, వస్తున్న వాటిని కూడా ఆపకపోవడంతో విద్యార్థులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళంలలోని విద్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ప్రైవేట్ వాహనాల్లో అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పది గ్రామాల విద్యార్థులు వచ్చే ఈ కూడలిలో రిక్వెస్ట్ స్టాప్ ఇవ్వాలని, బస్సులు సమయానికి ఆపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ కె. దీప విద్యార్థులతో మాట్లాడి, ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బూర్జ ఎస్సై ఎం. ప్రవల్లిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.

సంబంధిత పోస్ట్