శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరులో తాగునీటి సమస్య వెంటాడుతుంది. గ్రామానికి తాగునీరు సరఫరా అయ్యే పైప్లైన్ పాడవటంతో నీటి కోసం పాట్లు తప్పడం లేదు. ఓ వృద్ధుడు కావడిలో వంశధార నదిలోని గోతుల్లో నీటిని రెండుబిందెలతో 1కి.మి నడిచి బట్టేరుకు తీసుకెళ్తున్నాడు. అనంతరం ఈనీరును వడపోసి తాగుతున్నామని ఆ పెద్దాయన చెప్పారు. పైప్‌లైన్లను మరమ్మతులు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరాడు.