తల్లిని ముళ్లపొదల్లో వదిలిన కన్న బిడ్డలు

6చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలే భారంగా భావించి, పాలవలస రైల్వే పట్టాల పక్కన ముళ్లపొదల్లో వదిలేసిన మైలపిల్లి లక్ష్మి (60) అనే వృద్ధురాలిని ఓ గొర్రెల కాపరి గుర్తించాడు. మూడు రోజులుగా అన్నపానీయాలు లేక అలమటిస్తున్న ఆమెను 'సీతయ్య ఫౌండేషన్' వారు రక్షించి, ఆసుపత్రిలో వైద్యం అందించిన అనంతరం తమ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.