ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jun 04, 2026, 07:06 IST/

డ్రగ్స్ పెడ్లర్‌ను పట్టించిన ర్యాపిడో రైడర్ (వీడియో)

Jun 04, 2026, 07:06 IST
హైదరాబాద్ శివారు దుండిగల్​లో గంజాయి రవాణా చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్​ను ర్యాపిడో రైడర్ పట్టుకున్నాడు. మే 31న బీహార్​కు చెందిన రూపేశ్ కుమార్ మేడ్చల్​ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా పార్సిల్​ బుక్​ చేశాడు. పార్సిల్​పై అనుమానం వచ్చిన ర్యాపిడో డ్రైవర్ ఆదర్శన్​ దుండిగల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పార్సిల్​ను పరిశీలించగా గంజాయి ఉన్నట్లు గుర్తించి, రూపేశ్​ను అరెస్ట్​ చేశారు. అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై విచారణ చేస్తున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సహకరించిన ర్యాపిడో రైడర్ ఆదర్శన్​ను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.