శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం పంచాయతీ సేగిడిపేటలో కిడ్నీ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న సోపేటి చక్రధర్ రావుకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు ₹10,000 పెన్షన్‌ను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ₹5,000 పెన్షన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు హామీ మేరకు ₹10,000కి పెంచినట్లు ఆయన గుర్తు చేశారు. లబ్ధిదారుల కుటుంబానికి పెద్ద కుమార్తెకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని శంకర్ పేర్కొన్నారు. పెన్షన్ పెంపు తమకు పెద్ద సహాయం అవుతుందని లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల 1న ఇంటి వద్దనే పెన్షన్ అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.