శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ శనివారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలకు విస్తృతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని, పేదలు, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసే అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయంతో అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, రాబోయే రోజుల్లో మరింత మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ కూడా పాల్గొన్నారు.