కోవిలాం గ్రామ దుర్గాదేవి ఆలయంలో నాగుపాము కలకలం

4చూసినవారు
కోవిలాం గ్రామ దుర్గాదేవి ఆలయంలో నాగుపాము కలకలం
ఎల్.ఎన్.పేట మండలంలోని కోవిలాం గ్రామ త్రిశక్తి శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఆదివారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమై భక్తుల్లో ఆందోళన కలిగించింది. భవానీ మాల ధారణలో ఉన్న భక్తులు ఆలయం వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, వారిలో ఒకరు పామును గమనించి ఇతరులను అప్రమత్తం చేశారు. ఒక్కసారిగా కలకలం రేగడంతో వెంటనే పాములు పట్టే సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి జాగ్రత్తగా పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలారు.

సంబంధిత పోస్ట్