విపత్తుల సమయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. అన్ని జిల్లాలు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించాయి. ఈ నెల 30న పైడిభీమవరం వద్ద రసాయన విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.