ఆమదాలవలస రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుండగా, శక్తి టీం హెచ్సీ అమ్మాజీ, సిబ్బంది వారిని కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాలకొండకు చెందిన యువతీయువకుడు ప్రేమించుకొని పెద్దలకు చెప్పినా వారు ఒప్పుకోలేదని, దీంతో ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తీసుకెళ్లిన డబ్బు ఖర్చయిపోవడంతో ఆర్థికంగా కష్టాల్లో పడి చనిపోవాలనుకున్నామని ఆ జంట పేర్కొంది.