పోలాకి మండలం కోడూరు గ్రామంలో శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి టెంక సంజీవి (50) అనే వ్యక్తి మృతి చెందారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కొబ్బరి కాయల కోసం చెట్టు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించి, నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.