శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీనివల్ల రహదారులపై వాహనాల రాకపోకలు మందగించాయి, దూరం కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ, గ్రామీణ రహదారులపై వాహనాలు హెడ్‌లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ మంచు జీడీ, మామిడి పూతలకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.