ఏప్రిల్ 27న శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా గార మండలం పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపరాష్ట్రపతి విశాఖకు వెళ్లే వరకు డ్రోన్లతో చిత్రీకరణ చేయరాదని ఆదేశించారు.