శ్రీకాకుళం రూరల్ మండలంలో కిష్టప్ప పేట–అంపోలు గ్రామాలను చింతబంద మీదుగా లింగం చెరువు వరకు 4 కిలోమీటర్ల పొడవున 20 అడుగుల వెడల్పుతో సుందర మట్టి రహదారిని నిర్మించారు. ఈ రహదారి రైతులకు తమ వ్యవసాయ భూములకు సులభంగా చేరుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. రహదారి నిర్మాణాన్ని గొండు శంకర్ స్వయంగా కాలినడకన పరిశీలించారు. ఈ అభివృద్ధి పట్ల రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.