గాలివాన బీభత్సం.. రేకు పడి రైతు మృతి

0చూసినవారు
గాలివాన బీభత్సం.. రేకు పడి రైతు మృతి
బుధవారం జి.సిగడాం మండలంలో కురిసిన గాలివానకు పశువులశాల రేకు ఎగిరిపడి గెడ్డకంచరాం గ్రామానికి చెందిన నక్క సూరప్పడు (62) అక్కడికక్కడే మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన నక్క మంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సూరప్పడు, మంగమ్మ పశువులను మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈదురుగాలులు, వర్షం రావడంతో రేకులు ఎగిరి సూరప్పడుపై పడ్డాయి. దీంతో అతని రెండు కాళ్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావంతో బుధవారం మృతిచెందారు. గాయపడిన మంగమ్మను రాజాం ఆసుపత్రికి తరలించి, పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్