శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సోమవారం సిఐ నారీమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ఇతర అభివృద్ధి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. విజేతలకు ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.