విశాఖలోని తగరపువలస పరిధి వలందపేట గ్రామంలో శ్రీకాకుళంకు చెందిన నాగమణి (26) తన భర్త సూరిబాబు అలియాస్ తాత (28)ను చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. భర్త తాగి పడిపోయి లేవడం లేదని, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. సంగివలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా, భార్య నేరం అంగీకరించింది. అనుమానం, తాగి ఇంటికి రావడమే గొడవలకు కారణమని తెలిసింది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.