శుక్రవారం ఉదయం బుడుమూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముంత పైడిరాజు ఇంట్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న శ్రీరాములు, గోపి ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. వనం శ్రీనివాసరావు డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో శ్రీరాములు కుమార్తె వివాహం కోసం దాచుకున్న రూ.5 లక్షల నగదుతో పాటు మొత్తం రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి.